Parth Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు పవార్ కొడుకు!

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ కీలక పదవిని చేపట్టేందుకు సునేత్రా పవార్ సిద్ధమయ్యారు.

New Update
pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ కీలక పదవిని చేపట్టేందుకు సునేత్రా పవార్ సిద్ధమయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పగ్గాలను ఆమెకు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి.

మహారాష్ట్ర(maharashtra) కొత్త ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు ఆమె ఇప్పటికే ఆమోదం తెలిపారు.  ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో ఆమె తన ప్రస్తుత రాజ్యసభ(rajyasabha) సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.

సునేత్రా పవార్ రాజీనామాతో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి ఆమె పెద్ద కుమారుడు పార్థ్ పవార్‌(Parth Pawar) ను నామినేట్ చేయాలని ఎన్సీపీ భావిస్తోంది. దీని ద్వారా పార్థ్ పవార్ అధికారికంగా పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సునేత్రా పవార్ ఆరు నెలల లోపు రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. తన భర్త అజిత్ పవార్(ajith-pawar) ప్రాతినిధ్యం వహించిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది.  

సునేత్ర పవార్ 1963, అక్టోబర్ 18న మహారాష్ట్రలోని ధారాశివ్ (పాత పేరు ఉస్మానాబాద్) జిల్లాలో జన్మించారు. 1985లో అజిత్ పవార్‌తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, పార్థ్ పవార్, జయ్ పవార్. ఆమె ప్రస్తుతం ఎన్సీపీ (NCP) తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు (జూన్ 2024లో ఎన్నికయ్యారు).

2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ, పార్టీలో బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు.

Also Read :  అబ్బబ్బా.. మామూలు మాయలేడి కాదు.. ముగ్గురు మొగుళ్లను ముంచేసింది!

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కాగా గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి, అక్కడ ఆయన కుమారులు చితికి నిప్పంటించి, అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్‌సిపి (ఎస్‌సిపి) చీఫ్ శరద్ పవార్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ సహా పలువురు ప్రముఖ నాయకులు, ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.

Also Read :  అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్లు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు