/rtv/media/media_files/2025/11/28/keerthy-suresh-2025-11-28-09-56-07.jpg)
Keerthy Suresh
Keerthy Suresh: నటి కీర్తి సురేష్ కొత్త సినిమా ‘రివాల్వర్ రీతా’ను నవంబర్ 28, 2025న విడుదలకు సిద్ధం చేస్తోంది. ఈ సినిమా విడుదల కోసం మీడియాతో మాట్లాడుతూ, ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఊహించని వివాదం ఏర్పడింది. కీర్తి సురేష్ గతంలో, నటనలో లేదా డాన్స్‌లో తలపతి విజయ్ ను ఆమె ఎక్కువ ఇష్టపడతానని చెప్పిన విషయం కొంతమంది ఫ్యాన్స్‌కి చిరంజీవి గారిని కించపరిచినట్టు అనిపించింది.
Keerthy Suresh Controversy
“If they’re hurt, I’m sorry. But it was still MY CHOICE TO SAY WHAT I FELT.”#KeerthySuresh on choosing Thalapathy VIJAY as her FAVOURITE DANCER over Megastar CHIRANJEEVI. pic.twitter.com/pguA9dMHDO
— Gulte (@GulteOfficial) November 26, 2025
ఈ వివాదానికి స్పందిస్తూ కీర్తి సురేష్ స్పష్టత ఇచ్చింది “ఇది ఎవరు బాగుంటారు అని పోల్చడం కాదు. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టం, ఆయనపై పూర్తి గౌరవం ఉంది. నేను ఆయన అభిమానులకి క్షమాపణలు చెప్పాలి, ఎవ్వరినీ బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. చిరంజీవి గారు నాతో ఇలా మాట్లాడుతూ, నాకు ఎవరి నటన, ఎవరి డాన్స్ ఇష్టమని అడిగారు. నేను విజయ్ సర్ డాన్స్ చాలా నచ్చుతుంది అని చెప్పాను. ఇది చెబుతూ ఎవరినీ తక్కువ చేయడం కాదు. చిరంజీవి గారు కూడా నా నిజాయితీని సంతోషంగా స్వీకరించారు. మా మధ్య సంభాషణలు చాలా స్నేహపూర్వకంగా జరిగాయి.” అని తెలిపింది.
కీర్తి సురేష్ మరిన్ని వివరాలు చెప్పింది, “చిరంజీవి గారు ఒక మెగాస్టార్. ఆయన గురించి ఏమి అనలేదు. కానీ నేను చెప్పాలనిపిస్తే, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను అంతే విజయ్ సర్ కూడా ఒక లెజెండ్, నేను ఆయన సినిమాలు ఎక్కువ చూసిన కారణంగా అలా చెప్పాను. చిరంజీవి గారు దీనిని బాగా అర్థం చేసుకున్నారు.”
"వివాదం రావడానికి కారణం పూర్తిగా విజయ్ సర్ డాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చి చెప్పడం వల్ల మాత్రమే. ఎవరినీ తక్కువ చేయలేదని, చిరంజీవి గారిని గౌరవిస్తూనే అభిప్రాయాన్ని చెప్పాను" అని కీర్తి వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
Follow Us