Wedding: పెళ్లిలో వింత చేష్టలు.. భోజనాన్ని వేలం వేసిన వధూవరులు

ఓ పెళ్లి వేడుకలో ఏకంగా భోజనాన్ని వేలం వేయడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Newlywed couple auctions dinner at wedding to pay for honeymoon

Newlywed couple auctions dinner at wedding to pay for honeymoon

సాధారణంలో పెళ్లి వేడుకకు వచ్చే అతిథులను మర్యాదగా చూసుకుంటారు. ముఖ్యంగా వంటల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అందరూ భోజనం చేసి వెళ్లేలా చూస్తారు. అయితై తాజాగా ఓ పెళ్లి వేడుకలో ఏకంగా భోజనాన్ని వేలం వేయడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్

ఇక వివరాల్లోకి వెళ్తే  ఎక్స్‌లో @turbothad అనే యూజర్‌ దీని గురించి రాసుకొచ్చారు. '' ఓ పెళ్లి వేడుకలో.. వివాహం జరిగిన తర్వాత ఆకలితో ఉన్న అతిథులకు మొదటి భోజన ప్లేట్‌ను వేలం వేస్తున్నామని వధూవరులు ప్రకటించారు. ఆ ప్లేట్‌ కొన్న వాళ్లకే ముందుగా భోజనం వడ్డిస్తామని చెప్పారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అలాస్కాలో హనీమూన్‌ ట్రిప్‌కి వాడుకుంటామన్నారు. ఒక అతిథి మొదటి ప్లేట్‌ భోజనం కోసం ఏకంగా 1500 డాలర్లు ఇచ్చినట్లు'' పేర్కొన్నారు. మన కరెన్సీలో దీని విలువ ఏకంగా రూ.1.25 లక్షలు. 

Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పని కాదని.. పెళ్లి అంటే డబ్బు సంపాదించేందుకు మాత్రమే అన్నట్లు ఈ వ్యవహారం ఉందని మండిపడుతున్నారు. ఆహారాన్ని ఇలా అమ్మడం సిగ్గుచేటని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు ఇలా చేస్తే మేము పెళ్లి నుంచి బయటకు వెళ్లిపోయేవాళ్లమంటూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు