ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొని కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. కొండపల్లిలోని అమరవీరుల స్తూపాలను కూల్చివేశాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వీ హిడ్మా సొంతూరు అయిన బీజాపూర్ జిల్లాలో పూవర్తిని సీఆర్పీఎప్ దళాలు అధీనంలోకి తీసుకొని క్యాంపును ఏర్పాటు చేశాయి. దాదాపు 5 వేల మంది కేంద్ర బలగాలు.. పూవర్తి అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
Also Read: రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!
మావోయిస్టులు ఎక్కువగా ఉండే కొండపల్లి గ్రామంలో కూడా గురువారం సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, మహిళా కమాండోలు బరిలోకి దిగారు. అయితే కొండపల్లిని అధీనంలోకి తీసుకొని అక్కడ భారీ అమరవీరుల స్తూపాలను కూల్చివేశారు. గతంలో చనిపోయిన మావోయిస్టుల ముఖ్య నేతల స్మారకార్థం పదేళ్లక్రితం కొండపల్లిలో ఈ స్తూపాలను నిర్మించారు. ఇక్కడే మావోయిస్టుల సమావేశాలు కూడా జరుగుతుండేవి. దాదాపు ఇవి 20, 30 అడుగుల ఎత్తులో ఉంటాయి.
Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?
అయితే కొండపల్లిలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడం, స్తూపాలు కూల్చివేయడంతో మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారు. వేలాది మంది పోలీసులు అక్కడ మకాం వేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పూవర్తి, గుండం, ధర్మారంలో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేస్తుండగా మావోయిస్టులు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
Also Read: యూపీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. వెలుగులోకి సంచలన నిజాలు!