పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే? తల్లిదండ్రులే కన్న కూతురిని పెళ్లి పేరుతో రూ.1.80 లక్షలకు అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటుచేసుకుంది. మైనర్ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాలికను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏదో విధంగా ఆ బాలిక తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 16 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఇండోర్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలికను పెళ్లి పేరుతో సొంత తల్లిదండ్రులే ఆమెను అమ్మేశారు. రూ.1.80 లక్షలకు కన్న కూతరుని పెళ్లి పేరుతో గుజరాత్‌కి చెందిన వ్యక్తికి విక్రయించారు. కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఓ గోదాములో రెండు రోజుల పాటు ఆ బాలికను బంధించి అత్యాచారం చేశాడు. ఇది కూడా చూడండి: Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు తప్పించుకుని పారిపోయి.. ఏదో విధంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లైంగిక నేరం పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అలాగే తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. బాలికను అమ్మేసిన తల్లిదండ్రులతో మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చూడండి: పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఓ తాగుబోతు మహిళా కండక్టర్‌పై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో వాగ్వాదానికి దిగిన హరిబాబు అనే బస్ డ్రైవర్, మహిళా కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆ మహిళా కండక్టర్ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! ఇప్పటికే బస్సు డ్రైవర్ హరిబాబుపై పలు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. కామేపల్లి ప్రభుత్వ వైద్యశాలపై కూడా దాడి చేశాడట. దీనిపై కూడా తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో హరిబాబు ఉన్నాడు. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా #madhyapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి