రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర! మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ విసిరిన ఛాలెంజ్ ను బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. శనివారం మూసీ పరీవాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామని ప్రకటించారు. అవసరమైతే 3 నెలలు నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. By srinivas 16 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ మూసీ వివాదంపై తెలంగాణ నేతల మధ్య వార్ రసవత్తరంగా మారింది. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్న నాయకులు మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ చేసిన ఛాలెంజ్ ను బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. శనివారం మూసీ పరీవాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామని ప్రకటించారు. ఇదే బీజేపీ నినాదం.. 'మూసీ వద్ద ఒక్క రోజే కాదు.. అవసరమైతే మూడు నెలలు నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నాం. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే బీజేపీ నినాదం. పునరుజ్జీవం పేరిట రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గపు చర్య. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహారాష్ట్రలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు స్వర్గసీమ అంటూ రాహుల్‌గాంధీ పొగుడుతుంటే రేవంత్ జబ్బలు చరుచుకోవడం విడ్డూరం. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు తెలంగాణలో యాత్రలు చేపట్టి అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కదాన్ని కూడా అమలు చేయట్లేదు. రైతు రుణమాఫీ కూడా అరకొరగానే చేశారు. తెలంగాణలో మాటలు ప్రజలకు, మూటలు కాంగ్రెస్ పార్టీకి అన్న చందంగా ఉంది. కేసీఆర్ మాదిరే రేవంత్‌రెడ్డి పాలన సాగుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: TG Group-3: రేపే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఇచ్చిన వాటికే తాము ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం చేస్తోందన్నారు. అలాగే లగచర్ల ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టాలన్నా, భూసేకరణ చేయాలన్నా రైతులతో చర్చలు జరపాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్ భూసేకరణకు సంబంధించి కలెక్టర్ మీద దాడి జరిగి రైతులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్‌ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు #CM Revanth #musi #bjp-kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి