SCR కీలక నిర్ణయం.. ఈ రైల్వేస్టేషన్‌‌కు ఛత్రపతి శంభాజీ పేరు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది. ఇకపై ఈ స్టేషన్‌ను 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పిలవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ గౌరవార్థం ఈ పేరు మార్చారు.

New Update
Chhatrapati Shambhajinagar Railway Station

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు(Aurangabad Railway Station name change) ఇప్పటి నుంచి మారిపోయింది. ఇకపై ఈ స్టేషన్‌ను 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పిలవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (south-central-railway) ప్రకటించింది. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ గౌరవార్థం ఈ పేరు మార్చారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఔరంగాబాద్ నగరం పేరును మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చింది. ఈ నేపథ్యంలో, రైల్వే స్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

Also Read :  మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్‌.. లొంగిపోయిన 71 మంది మావోలు

SCR Changed As Chhatrapati Shambhajinagar Railway Station


తాజాగా, మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న రైల్వే స్టేషన్ పేరు మార్పుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయగా, దీనికి సంబంధించిన రైల్వే ప్రక్రియను దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కొత్త కోడ్ 'CPSN' ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త కోడ్‌గా 'CPSN' (CHHATRAPATI SAMBHAJINAGAR) ను కేటాయించారు. రైల్వే టికెట్లు, టైమ్‌టేబుళ్లు, బోర్డులు, ఇతర అధికారిక రికార్డుల్లో ఇకపై ఇదే పేరు, కోడ్‌ను ఉపయోగిస్తారు.

Aloso Read :  మొదటి సారిగా ఢిల్లీ రాష్ట్రానికి అధికారిక చిహ్నం.. ఆవిష్కరణ తేది ఫిక్స్

స్టేషన్ చరిత్ర ఈ రైల్వే స్టేషన్‌ను 1900 సంవత్సరంలో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు. ఈ చారిత్రక స్టేషన్ కాచిగూడ-మన్మాడ్ సెక్షన్‌లో ఉంది. ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్‌గా పిలవబడుతున్న ఈ ప్రాంతం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన ప్రఖ్యాత అజంతా, ఎల్లోరా గుహలకు సమీపంలో ఉండటం వలన పర్యాటక కేంద్రంగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రయాణీకులు ఈ పేరు మార్పును గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు