/rtv/media/media_files/2025/07/26/road-accident-2025-07-26-21-10-23.jpg)
Mumbai-Pune Expressway Accident
Mumbai-Pune Expressway Accident:
మహారాష్ట్ర పూణే జిల్లాలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దాదాపు 16 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలోని టన్నల్ ఎంట్రీ ఈ ప్రమాదం జరిగింది. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన ఆ కంటైనర్ ముందున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి.
Also Read: 'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్
Major accident on Pune-Mumbai Expressway; 20–25 vehicles damaged pic.twitter.com/2LsGCQtpHw
— Pune First (@Pune_First) July 26, 2025
Also Read: కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ
ఈ ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా సుమారు 16 మంది గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఎక్స్‌ప్రెస్‌వే పలు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చాలా శ్రమించారు.
Also Read: "హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరోసారి థియేటర్లలోకి ప్రభాస్ 'పౌర్ణమి'.. ఎప్పుడంటే..?