/rtv/media/media_files/2025/04/18/H8xrk1uHqn2G2lNzZ2xZ.jpg)
Satyagraha For Men
Satyagraha For Men : మహిళలతో పాటు పురుషులకూ సమాన హక్కులు ఉండాలన్న డిమాండ్ తో ఢిల్లీలో సత్యాగ్రహానికి బయలు దేరారు పురుష పుంగవులు. రేపు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ధ సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలు బృందాలు ఢిల్లీకి బయలు దేరాయి.మగవారి హక్కుల పరిరక్షణ పోరాట సంఘం కార్యకర్తల బృందం శుక్రవారం విశాఖ నుంచి ఢిల్లీకి పయనమైంది. స్త్రీల కోసం ప్రత్యేక కమిషన్ ఉన్నట్లే మగవారి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, మహిళల రక్షణకు షీ టీమ్స్ మాదిరిగా మగవారి రక్షణకు హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హెల్ఫ్ లైన్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఇవే డిమాండ్లతో తెలంగాణలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ధ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం తెలిసిందే.
Also Read: Gold: లక్షకు చేరువలో బంగారం.. ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొనేందుకు ఇది సరైన సమయమేనా?
ఈ సందర్భంగా వారు రైల్వే స్టేషన్‌లో ప్లెక్సీని ప్రదర్శిస్తూ స్లోగన్స్ వినిపించారు. స్త్రీల కోసం కమిషన్ ఉన్నట్టే పురుషుల కోసం మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం అంటూ ప్లెక్సీని ప్రదర్శించారు.సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య మగవారిపై సైతం దారుణాలు పెరిపోతున్న సంగతి తెలిసిందే. మగవారిని ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. అంతేకాక ఆడవారి చేతిలో మోస పోవడం, వారి చేతిలో హత్యకు గురికావడం సర్వ సాధారణమైంది. ఈ విషయంలో మగవారికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు లేకపోవడంతో వారికి అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కారణం లేకున్నా కొందరు భార్యలు భర్తలపై గృహ హింస లాంటి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న ఘటనలు అనేకం ఉంటున్నాయి. నలుగురిలో ఆడవారిని అవమానిస్తే కేసులు పెట్టే చట్టం మగవారిని పదిమందలో పరువుతీసిన పట్టించుకునేవారు కరువయ్యారు. ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు సైతం పెరిగిపోయాయి. దీంతో ప్రియుడితో కలిసి భర్తలను హతమారుస్తున్న కేసులు సైతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే స్త్రీల కోసం మహిళా కమిషన్ ఉన్నట్టుగా పురుషుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్ల నేపథ్యంలో పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా చట్టాలు, పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినపడుతోంది.
Also read: Maoist: ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్