/rtv/media/media_files/2025/05/28/amv4bfBI4hK8ndsy2a3m.jpg)
Pakistan Air base Pics
ఆపరేషన్ సింధూర్ లో భారత్, పాకిస్తాన్ లోని 8 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. దాయాది దేశంలో మురిద్, నూర్ ఖాన్ లలో ఎయిర్ బేస్ లు దారణంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు కూడా ఉన్నాయి. షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్‌తార్ టీబీ2ఎస్, బేరక్‌తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్‌లు, ఆయుధాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించి ఇంత ముందే చాలా ఉపగ్రహ చిత్రాలు విడుదల అయ్యాయి. ది ఇంటెల్ ల్యాబ్’కు చెందిన జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ వీటిని బయటపెట్టారు.
భూగర్భ స్థావరాలు సైతం..
తాజాగా మురిద్ ఎయిర్ బేస్ కు సంబంధించి మరిన్ని ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. భారత్ క్షిపణుల దాడిలో ఈ ఎయిర్ బేస్ చాలా మట్టుకు ధ్వంసం అయింది. మురిద్ లో భూగర్భ స్థావరాలను కూడా నిర్మించింది పాకిస్తాన్. భారత్ దాడుల్లో ఇది కూడా దెబ్బ తిందని తెలుస్తోంది. ఎయిర్ బేస్ కు 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పు గల భూగర్భ స్థావరం ధ్వంసం అయింది. మానవ రహిత వైమానిక వాహనాలను ఉంచే నిర్మాణం యొక్క పైకప్పు మొత్తం కూలిపోయింది. దాంతో పాటూ వైమానిక స్థావరం దగ్గర పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. ఈ కాంప్లెక్స్ డబుల్ ఫెన్సింగ్, దాని స్వంత వాచ్ టవర్లు మరియు యాక్సెస్ కంట్రోల్‌తో భారీగా నిర్మించబడింది. అలాంటి దాన్ని భారత క్షిపణులు కూల్చివేశాయి. ఈ చిత్రాలను కూడా పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టారు. ఇవి మే 2 తరువాత చిత్రాలని తెలుస్తోంది. మురిద్ వైమానిక స్థావరం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పాకిస్తాన్‌లోని చక్వాల్‌లో ఉంది. ఇది రావల్పిండిలోని సర్గోధా వైమానిక స్థావరం, నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి అనుసంధానంగా పని చేస్తుంది.
మురిద్ ఎయిర్ బేస్ తో పాటూ నూర్ ఖాన్ వైమానిక స్థావరాల చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. భారత్ దాడులలో ఇక్కడ కూడా చాలానే స్థావరాలు దెబ్బతిన్నాయి. నూర్ ఖాన్ లోని పాకిస్తాన్ సైన్యానికి ప్రధాన కార్యాలయం, దేశ రాజకీయ శక్తి కేంద్రం రెండూ ధ్వంసం అయ్యాయి.
today-latest-news-in-telugu | indian army operation sindoor | pakistan | air base
Also Read: Trump: కెనడాను అమెరికాలో కలిపేస్తే..గొల్డెన్ డోమ్ ఫ్రీ..ట్రంప్