Trump: కెనడాను అమెరికాలో కలిపేస్తే..గొల్డెన్ డోమ్ ఫ్రీ..ట్రంప్

కెనడాను ఎలా అయినా అమెరికాలో కలిపేసుకోవాలని కంకణం కట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను కెనడా పొందవచ్చని..కాకపోతే ఆ దేశం అమెరికాలో కలిసి పోవాలని చెప్పారు. 

New Update
us

Trump, Golden Dome

భవిష్యత్తులో అమెరికాను ఎవరూ ఏమీ చేయలేకుండా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్.  గోల్డెన్‌ డోమ్ వలన అంతరిక్ష దాడులను కూడా తప్పించుకోగలదు అమెరికా. దీంతో ప్రపంచంలోనే అమెరికా అత్యంత రక్షణ వ్యవస్థ కలది అవుతోంది. ఈ కారణంగా దీనిపై కెనడా కూడా ఆసక్తి కనబరిచింది. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఇదే అదను అని మరోసారి విలీనం డిమాండ్ ను తెర మీదకు తీసుకువచ్చారు. కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా మారితే గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఫ్రీగా పొందచ్చునని అన్నారు. లేదంటే మాత్రం 61 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ.. 

అమెరికా ప్రజలకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తానని అధ్యక్షుడు ఎన్నికల సమయంలో మాటిచ్చారు. అన్నట్టుగానే ఇప్పుడు అమెరికాను క్షిపణుల బారి నుంచి రక్షించడానికి గోల్డెన్ డోమ్ ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూడేళ్ళల్లో దీన్ని ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొదటి విడతలో గోల్డెన్ డోమ్ కోసం 25 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నామని...పూర్తయ్యేటప్పటకి 175 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని చెప్పారు. 

 today-latest-news-in-telugu | usa | america president donald trump | canada 

Also Read: Space X: వరుసగా మూడోసారి..గాల్లో పేలిన ఎలాన్ మస్క్ రాకెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు