Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనానికి రెండు రోజుల నుంచి భక్తులు తాకిడి మరింత పెరిగింది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసిపోతున్నాయి. పంబ వరకూ క్యూలైన్ వ్యాపించింది. ఇటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పలు స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు.కేవలం శుక్రవారం ఒక్క రోజే 87,186 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సీజన్‌లో ఇంత సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.
Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా
శని, ఆదివారాలు కూడా రద్దీ తీవ్రంగా ఉంది. రాత్రి 11 గంటల తర్వాత ఆలయం మూసివేయడంతో దర్శనాలు ఆగాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మళ్లీ భక్తులను అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దర్శనాలకు 10 నుంచి 14 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరకుట్ట సమీపంలోని మూడు చోట్ల భక్తులను నియంత్రించి... సన్నిధానానికి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
Also Read: WInter:తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి
రోజుకు 80 వేల మందికి..
ఈ సీజన్‌లో భారీగా అయ్యప్ప దర్శనాలకు భక్తుల వస్తారని అంచనా వేసి.. రోజుకు 80 వేల మందికి (వర్చువల్ క్యూ 70,000, స్పాట్ బుకింగ్‌లు 10,000) దర్శన టిక్కెట్లు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, గతవారం భక్తుల రద్దీ అంచనా కంటే తక్కువగా ఉండటంతో అదనంగా మరో 10 వేల దర్శన టిక్కెట్లు జారీచేసే ఆలోచనలో ఉన్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. దీని వల్ల భక్తుల సంఖ్య మరింత పెరుగుతోందని తెలుస్తుంది.
Also Read: లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే
ఈ క్రమంలో శుక్రవారం నుంచి అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆలయంలో మండల పూజల సీజన్ మొదలైన తర్వాత వారం రోజుల్లో 5.30 లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు వివరించారు. గతేడాది మొదటి వారంలో ఈ సంఖ్య 2.64 లక్షలే ఉన్నట్లు సమాచారం. ‘శుక్రవారం 87,216 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Also Read: IPL Auction 2025: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్..
వీరిలో 11 వేల మంది స్పాట్ బుకింగ్ టోకెన్లు ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. గతవారం నిలక్కల్, ఎరుమేలి, సత్రం వద్ద ఏర్పాటుచేసిన స్పాట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా 50 వేల మంది భక్తులు టోకెన్లు తీసుకున్నట్లు టీడీబీ ఛైర్మన్ పీఎస్ ప్రశాంత్ వివరించారు.
అయితే, దర్శన టోకెన్ల పెంపుపై ఆయన ఆచితూచి స్పందించారు. నిర్వహించిన స్థాయికి మించిన భక్తుల రాక లాజిస్టికల్ సవాళ్లకు దారితీస్తుందని తెలిపారు. అయితే, గతేడాది డిసెంబరులో దర్శన టిక్కెట్లను 90 వేలకు పెంచాలని కేరళ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా శబరిమల స్పెషనల్ కమిషనర్ ఆర్ జయకృష్ణన్.. కోర్టుకు నివేదిక ఇచ్చారు.
నివేదిక పరిశీలించిన కోర్టు ప్రస్తుతం రోజుకు 80 వేల టోకెన్లు జారీ అవుతున్నాయని, తమ ఉత్తర్వులు అమలు కావడం లేదని చెప్పారు.ఈ నేపథ్యంలో మరో 10 వేల దర్శన టోకెన్లను పెంచేందుకు టీడీబీ చర్యలు చేపట్టింది.