Vladimir Putin : ఉగ్రవాదాన్ని ఏకిపారేయండి.. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ వెల్లడించారు. పహాల్గామ్ ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు.

New Update
putin modi

putin modi

భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ వెల్లడించారు. పహాల్గామ్ ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు.  ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టులకు ఆయన సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పుతిన్ హామీ ఇచ్చారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన మోదీతో చెప్పారు.

Also read :  India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్‌ మరోసారి క్షిపణి ప్రయోగం?

Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

రష్యా విజయ దినోత్సవం 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయనను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. కాగా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే విజయ దినోత్సవానికి హాజరు కావాలని భారత ప్రధానమంత్రిని రష్యా ఆహ్వానించింది. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా పరిస్థితుల దృష్ట్యా మోదీ రష్యాను టూర్ ను రద్దు చేసుకున్నారు.   

Also Read : PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు