BIG BREAKING ఎన్నికల వేళ నితీష్ కుమార్ కు కోలుకోలేని దెబ్బ!

ఎన్నికల వేళ.. సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, నితీష్‌ కు అత్యంత సన్నిహితుడు  జై కుమార్ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

New Update
Nitish Kumar JDU

ఎన్నికల వేళ.. సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, నితీష్‌ కు అత్యంత సన్నిహితుడు  జై కుమార్ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో పార్టీ తీవ్రంగా విఫలం అవుతోందని విమర్శించారు. కొంతమంది నాయకులు చెప్పినట్లుగా నితీష్‌ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక విషయాలపై ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాను ఇంకా పార్టీలో కొనసాగలేనని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో పార్టికి మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.  

ఎన్డీయే కూటమిలో సీట్ల పంపికంపై ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జేడీయూ, బీజేపీ పార్టీలు 101 సీట్ల చొప్పున పంచుకున్నాయి. కూటమిలో మరో ప్రధాన పార్టీ అయిన జనశక్తి పార్టీకి 29 సీట్లను కేటాయించారు. అయితే.. ఈ సీట్ల పంపకాలపై జేడీయూలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. రోహ్తాస్ జిల్లాలోని దినారా అసెంబ్లీ నియోజకవర్గం నుండి జేడీయూ నేత జై కుమార్ సింగ్ పోటీ చేయాలని భావించారు.

అయితే.. పొత్తుల్లో భాగంగా ఆయన టికెట్ కు గండి పడింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఆయనకు మద్దతుగా తాము రాజీనామా చేస్తామని రోహ్తాస్ జిల్లా కార్యవర్గం మొత్తం ప్రకటించింది. దీంతో ఈ సంక్షోభాన్ని నితీష్ కుమార్ ఎలా పరిష్కరిస్తారన్న అంశం ఉత్కంఠగా మారింది.  మాజీ ఎమ్మెల్యే రామచంద్ర సాహ్ని బీజేపీకి గుడ్ బై చెప్పారు. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీలో ఆయన చేరారు. టికెట్ల కేటాయింపులో అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు