ఈమధ్యకాలంలో మందీర్-మసీద్ వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం అనంతరం ఇలాంటి వివాదాలను తీసుకొచ్చి తాముకూడా హిందూ నాయకలం అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పుణెలోని 'ఇండియా - ది విశ్వగురు' అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
RSS Chief Mohan Bhagwat
ప్రపంచ దేశాలకు భారత్ సామరస్యంగా ఉంటుందని చాటిచెప్పాల్సిన అవసరం ఉందని మోహన్ భాగవత్ అన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటామన్నారు. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నామని తెలిపారు. '' దేశంలో ప్రతీరోజు ఒక కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించాలి. ఇలాంటివి ఇంకా కొనసాగకూడదు. మనమందరం కలిసి మెలసి ఎలా ఉంటామో భారత్ ప్రపంచానికి చూపించాలి.
ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. ఇందులో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటారు. దేశంలో ఎవరో ఒకరు ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతీఒక్కరూ కూడా తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు ?. దేశంలో మైనార్టీ ఎవరు ?.. మెజార్టీ ఎవరు ?. అందరూ సమానమే. ఎవరైనా కూడా తమకు ఇష్టమైన దేవుడిని ఆరాధించవచ్చు. ఇదే మన దేశ ఆచారం. కానీ నిబంధనలు, చట్టాలకు లోబటి సామరస్యంగా జీవించడం కూడా అవసరమేనని'' మోహన్ భగవత్ అన్నారు.
ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు