ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు కేరళలో ఓ లారీ అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. ఈ ఘోర విషాదం కేరళలోని త్రిసూర్ జిల్లాలో నట్టకి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 26 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kerala: కేరళలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు మీద నుంచి బారికేడ్లను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లడంతో అక్కడే నిద్రపోతున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా..చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు పెద్దవారు ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర విషాదం కేరళలోని త్రిసూర్ జిల్లాలో నట్టకి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. Also Read: TTD: కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ! కర్ర దుంగలతో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి పక్కనే ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న జనంపై దూసుకెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘోరం జరిగినట్టు పోలీసులు అనుకుంటున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాలక్కడ జిల్లా గోవిందపురానికి చెందిన కలియప్పన్ (50), జీవన్ (4), నాగమ్మ (39), బంగజీ (29), విశ్వ (1)గా గుర్తించారు. ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. Also Read: AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్..జాగ్రత్త అంటున్న అధికారులు! ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Also Read: TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు! ఫుట్‌పాత్ పై పది మందికిపైగా నిద్రపోతున్నారని, కన్నూరు నుంచి కోచికి కర్ర దుంగలతో వెళ్తోన్న లారీ.. అదుపుతప్పి వారిపైకి ఎక్కిందని చెప్పారు. లారీ క్లీనర్ అలెక్స్ ఆ సమయంలో వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై పనులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలోకి వాహనాలను అనుమతిలేదని అధికారులు బోర్డు పెట్టారు. కానీ, దీనిని గమనించని ఆ క్లీనర్.. బారికేడ్లను ఢీకొట్టి నిద్రపోతున్న వారిపైకి వాహనం నడిపాడు. Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి