![chori](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/11/25/wV7s8XCXffJtPPumZta0.jpg)
ఈ మధ్య సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచం నలు మూలల్లో ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. మారు మూల గ్రామంలో జరిగిన సంఘటనలు సైతం ఈజీగా చూడగలుగుతున్నాం. అందులో ఎక్కువగా కామెడీ ఘటనలు ఉంటాయి. చాలా మంది కామెడీ సన్నివేశాలనే ఇష్టపడతారు. మరికొన్ని సంఘటనలు చాలా సీరియస్‌వే అయినా.. చూసే వారికి మాత్రం ఎంటర్‌ట్రైన్ అందిస్తాయి.
Also Read: చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి
పెళ్లి కొడుకునే మస్కా కొట్టించిన దొంగ
తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. పెళ్లి కొడుకు గుర్రంపై వెళ్తుంటే.. అటు వైపుగా వచ్చిన ఓ వ్యాన్ డ్రైవర్ అతడి మెడలో నుంచి నోట్ల దండను లాక్కొని వెళ్లిపోతాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకు హీరోలా మారిపోయాడు. వెంటనే అతడిని ఛేజ్ చేసి పట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే
Also Read: మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..
మీరట్‌లో ఓ పెళ్లి కొడుకు తన మేడలో నోట్ల దండతో గుర్రంపై ఉరేగుతున్నాడు. అదే సమయంలో అటు వైపుగా టాటా ఏస్‌లో వచ్చిన ఒక దొంగ.. పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను కొట్టేశాడు. దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు సినిమా రేంజ్‌ను తలపించేలా ఛేజ్ చేసి దొంగను పట్టుకున్నాడు. బైక్‌పై సినిమా రేంజ్‌లో వెంటపడి ఆ వ్యాన్‌ను పట్టుకున్నాడు.
పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను కొట్టేసిన దొంగ.. సినిమా రేంజ్‌ను తలపించేలా చేజ్ చేసి దొంగను పట్టుకున్న పెళ్ళికొడుకు
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024
మీరట్‌లో ఓ పెళ్లి కొడుకు మేడలో నోట్ల దండతో గుర్రంపై ఉరేగుతుంటే.. ఒక దొంగ టాటా ఏస్‌లో వచ్చి నోట్ల దండను దొంగిలించాడు.
దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్… pic.twitter.com/A8i4COfUNg
ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
వెంటనే ఆ వ్యాన్ ఆపి డ్రైవర్‌ను కిందకి దించి చితక్కొట్టాడు. అనంతరం పెళ్లి కొడుకు బంధువులు వచ్చి ఆ డ్రైవర్ దొంగను చితకబాదారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వేరే లెవెల్ ఛేజ్ అంటున్నారు. మరిక నెటిజన్ సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారని కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు