Karnataka: కర్ణాటకలో ముసలం.. సిద్ధరామయ్య VS డీకే శివకుమార్ వర్గాలు

కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. పదవులకు సంబంధించి వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే మాజీ మంత్రి కేఎన్ రాజన్న కూడా బీజేపీలో చేరనున్నారని ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

New Update
Rift widens in Karnataka Congress

Rift widens in Karnataka Congress

కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. పదవులకు సంబంధించి వాగ్వాదాలు జరుగుతున్నాయి. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యని తప్పించి డీకే శివకుమార్‌కు ఆ పదవి అప్పగించాలని మెజార్టీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిద్ధరామయ్య కూడా తానే ఐదేళ్లవరకు సీఎంగా ఉంటానని ఇటీవల స్పష్టం చేశారు. ఇటీవల డీకే శివకుమార్‌ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా నడిచింది. అయితే తాజాగా మరో ట్విస్టు చోటుచేసుకుంది. 

Also Read: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వర్గీయులు ప్రస్తుతం పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపైమరొకరు బహిరంగానే తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి కేఎన్ రాజన్న కూడా బీజేపీలో చేరనున్నారని ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ కూడా ఇటీవల ఆరోపించారు. రాజన్న రాష్ట్ర సహకార మంత్రిగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ విషయంలో ఆయన వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. దీంతో గత నెలలోనే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. 

Also Read: కవిత డ్రామాలు అందుకే.. బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్

రాజన్న బీజేపీలో చేరనున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై రాజన్న కొడుకు రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణనే బీజేపీలో చేరే టీమ్‌లో ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం ఆరాటపడుతున్న (DK శివకుమార్‌ను ఉద్దేశించి) వెంట వెళ్లబోతున్నారని తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని డీకే పేరును ప్రస్తవావించకుండా విమర్శించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నామంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: కవితకు KA పాల్ బంపరాఫర్.. గూస్‌బంప్స్ వీడియో

అంతేకాదు తన తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించడం వెనుక కూడా రహస్యం ఉందని ఆరోపణలు చేశారు. మొత్తానికి సిద్ధరామయ్య. డీకే శివ కుమార్‌ వర్గీయులు ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకోవడం రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతోంది. 

Also Read: నాడు హరికృష్ణ నుంచి నేడు కవిత, షర్మిల వరకు.. కుటుంబ సభ్యులతో విభేదించిన నేతల లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు