/rtv/media/media_files/2025/08/08/bandi-sanjay-reveals-key-facts-on-phone-tapping-case-2025-08-08-15-31-31.jpg)
Bandi Sanjay Reveals Key facts on Phone tapping case
Bandi Sanjay:
కవిత ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాప్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు.
కవిత రాజీనామాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు#BandiSanjay#Kavithapic.twitter.com/8EOnl5hB7U
— Telugu360 (@Telugu360) September 3, 2025
కాళేశ్వరం అవినీతిపై NDSA, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం, గొర్రెలు, బర్రెల కుంభకోణంపై చర్చ జరగాలని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. దానికి కారణం హరీశ్ రావు, సంతోష్ రావులే అని కవిత సంచలణ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.