Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడల్‌కు ఓకే–ఐసీసీ వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై స్తంభన ఎట్టకేలకు తొలిగింది. దీనిని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీని ప్రకారం ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ లలో జరగనుంది. By Manogna alamuru 13 Dec 2024 | నవీకరించబడింది పై 13 Dec 2024 19:53 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి చాలా రోజులుగా నలుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దీనిపై ఇప్పటివరకు నాలుగైదుసార్లు సమావేశాలు జరిగాయి. అయితే వీటల్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈరోజు జరిగిన సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ, బీసీసీఐ అంగీకరించాయి. దీని ప్రకారం ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ లలో జరుగుతుంది. దాంతో పాటూ 2026లో జరిగే టీ20 ప్రపచకప్ మీద కూడా బోర్టులు ఒక ఒప్పందానికి వచ్చాయి. భారత్‌తో జరిగే లీగ్-స్టేజ్ ఘర్షణ కోసం పాకిస్తాన్ భారత్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దానికి బదులుగా కొలంబోలో ఇది జరుగుతుంది. దీనికి పరిహారంగా పీసీబీకి ఎటువంటి ఆర్ధిక పరిహారం ఇవ్వలేదు. కానీ విషయాన్ని కాంపన్సేట్ చేస్తూ పీసీబీ 2027 తర్వాత ICC మహిళల టోర్నమెంట్ కోసం హోస్టింగ్ హక్కులను పీసీబీ పొందింది. పాక్‌లో మ్యాచ్‌లు ఆడటానికి ఇష్టపడిన బీసీసీఐ.. ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగనుంది. అయితే టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు పంపడం బీసీసీఐకి ఇష్టం లేదు. నిజానికి 2008 నుంచి భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇప్పుడు కూడా చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లే పరిస్థితి లేదని బీసీసీఐ అంటోంది. పాకిస్తాన్‌లో భారత క్రికెటర్లకు భద్రత లేదని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే గత కొన్నేళ్ళుగా ఇండియా టీమ్ పాకిస్తాన్ వెళ్ళడం లేదు. మరోవైపు ఆ దేశ జట్టు కూడా ఇండియా వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. గత కొంతకాలంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు బాగా లేవు. దాంతో పాటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఇస్లామాబాద్‌లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం కరెక్ట్ కాదని బీసీసీఐ భావించింది. ఈ కారణంగానే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరగడంపై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకత చూపించింది. పోని ఇండియాను తప్పించి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తే.. పాక్‌కి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతేడాదిలో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు కూడా భారత టీమ్ హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడింది. కానీ ఈసారి తప్పకుండా తమ దేశానికి రావాలని పాక్ భీష్మించుకుని కూర్చుంది. అయితే ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే పీసీబీకి అందే నిధుల్లో ఐసీసీ కోత విధిస్తుంది. పాక్‌లో జరగాల్సిన టోర్నీని పోస్ట్ పోన్ చేసిన లేకపోతే వేరే దేశానికి పంపిన కూడా ఆతిథ్య ఫీజు కింద వచ్చే రూ.548 కోట్లు ఇక పాకిస్థాన్‌కి రావు. ఇప్పుడు హైబ్రీడ్ మోడల్‌కు మార్చిన తర్వాత కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అందుకే 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ ఆదేశంలో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. Also Read: Varma: దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా..అధికారులకు రాంగోపాలవర్మ ప్రశ్న మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి