అల్లు అర్జున్ అరెస్ట్‌పై దర్శకుడు రాంగోపాల వర్మ తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సంఘటనే జరిగి ఎవరైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా..ప్రీ రిలీ ఫంక్షన్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేశారా ఆగ్రహం వ్యక్తం చేశారు రాంగోపాల వర్మ. భద్రతా ఏర్పాట్లు అనేవి ఆర్గనైజర్లు, పోలీసులు చూసుకోవాలి కానీ హీరోలు, రాజకీయ నాయకులు ఎలా బాధ్యులు అవుతారని ఆయన ప్రశ్నించారు.
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్…
Also Read: Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడల్‌కు ఓకే–ఐసీసీ