Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్!

మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్‌ రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలలకూ సమన్లు జారీ చేశారు.

New Update
ed

Medical College : మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సురేందర్‌ రెడ్డి వాంగ్మూలాన్ని ఇప్పటికే అధికారులు నమోదు చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ నాయకుడు, చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌ చల్మెడ లక్ష్మీ నరసింహారావు విచారణకు హాజరైనట్లు అధికారవర్గాల సమాచారం. 

Also Read:  ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల...

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి 2023 లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లక్ష్మీ నర్సింహారావును మెడికల్ సీట్ల బ్లాక్‌ దందా పై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో పలు సీట్లను బ్లాక్‌ చేసి అధిక ఫీజులకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది జూన్‌ లో సోదాలు జరిపారు. నీట్‌ పీజీ మెరిట్‌ ఆధారంగా కన్వీనర్‌ కోటా లేదా ఫ్రీ సీట్ల కింద దాదాపు 45 సీట్లను ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్‌ చేశారన్న ఆరోపణలున్నాయి.

Also Read:  Ap Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడ్రోజులు వానలే..!

ఈ విద్యార్థులు ఎవరూ కూడా వర్సిటీలో ఆడ్మిషన్‌ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించారు. దీని పై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌ కుమార్‌ 2022 ఏప్రిల్‌ వరంగల్‌ లోని మట్వాడ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Also Read: Karthikamasam :ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే!

సీట్లను బ్లాక్‌ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు ఉన్న ఆరోపణలపై మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో భాగంగా 2023 జూన్‌ 22న బొమ్మకల్‌ లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ , కరీంనగర్‌ జిల్లా నగునూర్‌ లోని ప్రతిమ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నల్గొండ నార్కెట్‌ పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లోని భాస్కర్‌ మెడికల్‌ కాలేజీ, మేడ్చల్‌ లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ , మహబూబ్‌నగర్‌ లోని ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కాలేజీ, సూరారంలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పటాన్‌ చెరులోని మహేశ్వర మెడికల్‌ కాలేజీ, చేవెళ్లలోని పట్నం మహేందర్‌ రెడ్డి మెడికల్‌ కాలేజీ, డెక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

అందులో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు..12 కాలేజీలతో పాటు మరికొన్ని కాలేజీల యాజమాన్యాలకు కూడా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని కాలేజీల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. 

మొత్తం కాలేజీల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు