Mamata Benarjee: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ

పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మరోసారి స్పందించిన మమతా బెనర్జీ వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తున్నాని తెలిపారు. తిరిగి విధుల్లో చేరాలని కోరారు.

New Update
Mamata Benarjee

Mamata Benarjee

పశ్చిమ బెంగాల్‌లో 2016 నుంచి విధులు నిర్వహిస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకి భరోసా ఇచ్చారు. దీనిపై నిరసన చేపట్టిన టీచర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మిడ్నాపోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read: 9 మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?

'' ఈ అంశంలో ఎవరు నిజాయితీపరులు ? ఎవరు కాదు అనేదానిపై ఆందోళన చెందవద్దు. జాబ్ ఉందా.. శాలరీ సరైన టైమ్‌కు వస్తుందా ? లేదా? అనే దాని గురించే ఆలోచించండి. టీచర్ల నియామకాల్లో పారదర్శకతకు సంబంధించిన లిస్ట్‌ను ప్రభుత్వం, కోర్టులు పరిశీలిస్తాయి. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. తిరిగి పాఠశాలలకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. మీతో నేను ఉన్నాను. 

ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ల తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తాం. అప్పటివరకు మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచడని'' మమత బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో 2016కు సంబంధించి టీచర్‌ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీటిని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 2024లో కోల్‌కత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.  

Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

మొత్తం 25,753 మంది ఉపాధ్యాయుల, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికీ ఈ టీచర్ నియామకాలు చెల్లవని తీర్పునిచ్చింది. దీనిపై మళ్లీ నియామకాలు చేపట్టాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.  

 telugu-news | rtv-news | mamata-benarjee | national-news

Advertisment
తాజా కథనాలు