UP: పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. 

New Update
up

UP Murder

ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన 31 ఏళ్ళు కలిగిన గుల్ఫామ్ అలీ తాజ్‌గంజ్ ప్రాంతంలోని శిల్ప్‌గ్రామ్ రోడ్డులో షాహిద్ అలీ చికెన్ బిర్యానీ సెంటర్‌లో పని చేస్తున్నాడు. రాత్రి ఆ రెస్టారెంట్ మూసేస్తుండగా కొంతమంది దుండుగులు వచ్చి కాల్పులు జరిపారు. గుల్ఫామ్ అలీని చంపేశారు. మరో వర్కర్ సయ్యద్ అలీ కూడా గాయపడ్డాడు. ఆ తరువాత దీనికి సంబంధించి ఒక వీడియోను కూడి రిలీజ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు చెప్పారు. అందులో మొత్తం 26 మందిని వాళ్ళు చంపారు. ఇప్పుడు మేము 2600 మందిని చంపేస్తామంటూ చెప్పారు. క్షత్రియ గోరక్షా దళ్ సభ్యులమని  చెప్పుకుంటూ ఓ ఇద్దరు వ్యక్తులు ఓ వీడియో చేశారు. అందులో షర్టులు వేసుకోకుండా.. ప్యాంట్లలో కత్తులు, తుపాకులు దోపుకుని కనిపించారు. 2600 మందిని చంపకపోతే తాము భరతమాత కుమారులే కాదంటూ బెదిరించారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్షణాల్లో వేలమంది దీన్ని చూసి షేర్ చేశారు. ఉగ్రదాడికి ప్రతీకార చర్య అని చెప్పడంతో మరింత వేగంగా వీడియో వెళుతోంది. అప్పుడే ఇది పోలీసుల కంట కూడా పడింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ కూడా చేశారు. అయితే పాపులర్ అవ్వడానికే వీడియో చేశారని...అసలు క్షత్రియ గోరక్షా దళ్ అనే సంస్థే లేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే గుల్ఫామ్ అలీని చంపింది కూడా వీళ్లు కాదని.. ఆహారం విషయంలో గొడవ జరిగి ఎవరో హత్యకు పాల్పడ్డారని తెలిపారు. గాయపడిన సయ్యద్ కూడా వీడియోలో ఉన్నవాళ్లు గుల్ఫామ్ అలీని చంపలేదని వాంగ్మూలం ఇచ్చాడు. 

 today-latest-news-in-telugu | uttarpradesh | murder | Pahalgam attack 

Also Read: Central Government: ఆ వార్తలు వద్దు..మీడియా, సోషల్ మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు