Himachal Pradesh Landslides : అంతా అల్లకల్లోలం..పెరుగుతున్న మృతుల సంఖ్య...!!
హిమాచల్ ప్రదేశ్లో వరణుడు పగపట్టినట్లున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడుగా ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఇప్పుటివరకు మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది. మృతుల సంఖ్యా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా విషాదఘటనలే కనిపిస్తున్నాయి. ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి.