/rtv/media/media_files/2025/10/11/narne-nithin-2025-10-11-19-41-17.jpg)
narne nithin
NTR Viral Video: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కృష్ణప్రసాద్ కూతురు శివానిని వివాహం చేసుకున్నారు. నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దగ్గుబాటి వెంకటేష్, రానా, నాగచైతన్య, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పలువురు సెలబ్రెటీలు పెళ్ళిలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ తన క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాలపై సీరియస్ అయిన వీడియో ఒకటి నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
#JrNTR snapped with his friends Rajeev Kanakala and Raghav at his brother-in-law #NarneNithiin and Lakshmi Shivani’s wedding. pic.twitter.com/PPutm003DI
— Gulte (@GulteOfficial) October 10, 2025
ఎందుకు సీరియస్..
అయితే రాజీవ్ కనకాల ఫోటో దిగకుండా పక్కకు వెళ్లి నిలబడడంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు వీడియోలో కనిపించింది. అలా పక్కకు వెళ్లి నిల్చున్నావు ఎందుకు.. ఇటు రా అంటూ సరదాగా సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ ఎంత స్టార్ హీరో అయినా తన ఫ్రెండ్స్ ని మాత్రం మర్చిపోలేదు! ఇప్పటికీ రాజీవ్ కనకాలతో అంతే స్నేహంగా ఉంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తారక్ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలా ఇద్దరూ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. తారక్ కుటుంబంలో ఏ ఫంక్షన్, శుభకార్యం ఉన్నా.. రాజీవ్, సుమ తప్పకుండా అటెండ్ అవుతుంటారు.
Also Read: Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది భార్య.. హీరో రానాకి ఏమవుతుందో తెలుసా?
Follow Us