జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడుల ఘటనలు చేటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని.. ఉగ్రవాదులకు సరైన బదులిస్తామని హెచ్చరించారు. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. '' జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగడం దురదృష్టరం. గతంలో జరిగిన దాడులతో పోలిస్తే ఈ మధ్యకాలంలో కాస్త తగ్గాయి. స్థానికంగా భద్రతాపరంగా ఎలాంటి లోపాలు కూడా లేవు. మన సైనిక దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి.
Also Read: నిషేధాన్ని పట్టించుకోని జనం.. భారీగా పెరిగిన పొల్యూషన్!
తుడిచిపెట్టుకుపోతాయి
ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. తొందర్లోనే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఉగ్రవాదులకు భారత సైన్యం సరైన బుద్ధి చెబుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఉగ్రవాదుల్ని హతం చేశామని'' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇదిలాఉండగా.. శనివారం తెల్లవారుజామున బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Also Read: ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి సర్.. తీరా చూస్తే పోలీసులు షాక్!
వరుసగా ఉగ్రదాడులు
ఇంతకుముందు కూడా అఖ్నార్ సెక్టార్‌లోని ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వరుసగా ఉగ్రదాడులు జరగడం ఆందోళన రేపుతోంది. శుక్రవారం నుంచి మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్‌లోని ఖన్యార్, బందిపోరాలోని పన్నెర్, అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక అనంత్‌నాగ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు
Also Read: సారూ...నేను ఇంకా బతికే ఉన్నాను...పోస్టుమార్టానికి తీసుకెళ్తుంటే..!