Delhi:నిషేధాన్ని పట్టించుకోని జనం.. భారీగా పెరిగిన పొల్యూషన్!

దీపావళి ఎఫెక్ట్ తో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత సూచీ 385 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ అలముకోవడంతో ఉదయం 9 వరకు రహాదారులు కనిపించలేదని చెప్పారు.

author-image
By srinivas
New Update
DK

Delhi: రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా దీపావళి రోజు బాణసంచాను నిషేధించింది ఢిల్లీ ప్రభుత్వం. శబ్దకాలుష్యంతో పాటు గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉంటుందనే ముందు జాగ్రత్తతో టపాసులు పేల్చొద్దని హెచ్చరించింది. అయినా జనం తమకు ఇవేవి పట్టనట్లు పలు చోట్ల భారీగా టపాసులు పేల్చారు. దీంతో ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. గాలి నాణ్యత విపరీతంగా పడిపోవడంతో దట్టమైన పొగ అలముకుంది. రోడ్లపై వాహనాలు కనిపించకపోవడంతోపాటు ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత 362 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మోదీ మీకు దండం.. మా బకాయిలు క్లియర్‌ చేయండి!

404 పాయింట్లకు చేరిన గాలి నాణ్యత సూచీ..

ఈ మేరకు ఆనంద్‌విహార్‌లో గాలి నాణ్యత సూచీ 385 పాయింట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఆర్కేపురం, అశోక్‌ విహార్, మందిర్‌ మార్గ్, ఎయిర్‌పోర్టు, రోహిణీ, జహంగీర్‌పుర్‌తో పాటు నొయిడా, గాజియాబాద్, గురుగ్రామ్‌లోనూ సూచీ 350పైగా ఉందన్నారు. అంతేకాదు దేశంలోనే పరిశుభ్ర నగరమైన మహారాష్ట్రలోని ఇందౌర్‌లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించినట్లు అధికారులు తెలిపారు. ఛోటి గ్వాల్తోలీలో గాలి నాణ్యత సూచీ 404 పాయింట్లకు చేరగా.. పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో సైతం గాలి నాణ్యత క్షీణించినట్లు చెప్పారు. ఇక టపాసుల కారణంగా ఢిల్లీలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోగా ముగ్గురు మరణించారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి: నోరు విప్పితే బీఆర్‌ఎస్‌ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు