భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత!

భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన బైరక్టార్ టీబీ2కి మానవరహిత డ్రోన్లు మోహరించినట్లు భారత సైన్యం నిర్ధారించింది. అధికారులు అప్రమత్తమయ్యారు.  

New Update
ererer

National: భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన టర్కిష్ డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను బంగ్లాదేశ్ సైన్యం మోహరించినట్లు భారత భద్రతా బలగాలు ద్రువీకరించాయి. బార్డర్ కు సమీపంలో బైరక్టార్ టీబీ2కి మానవరహిత వైమానిక వాహనాలను పంపినట్లు నిర్ధారించారు. 

రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు..

ఈ మేరకు బంగ్లాలోని 67వ సైన్యం నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోందని, రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు కార్యక్రమం చేపట్టినట్లు ఢాకా అధికారులు చెబుతున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో అశాంతి నేపథ్యంలో సున్నితమైన ప్రాంతంలో అధునాతన డ్రోన్లను వినియోగించడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు భారత సైన్యం పేర్కొంది. తాము అప్రమత్తంగా ఉన్నామని, డ్రోన్ విస్తరణలను నిశితంగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి..

మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. సరిహద్దుల్లో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత్ కూడా గూఢచార-భాగస్వామ్య యంత్రాంగాలను,అంతర్జాతీయ భాగస్వాముల సహకారాన్ని తీసుకుంటుందని చెప్పారు.  బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత.. ఫొటోలు వైరల్

ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు