Goa: గోవాలో పర్యాటకులు సంఖ్య ఎందుకు తగ్గిందంటే ?.. స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

గోవా బీచ్‌లో ఇడ్లీ-సాంబర్‌, వడా పావ్‌లు విక్రయించడం వల్లే విదేశీ పర్యాకుల సంఖ్య తగ్గిపోయిందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. గత రెండేళ్ల నుంచి పర్యాటకుల సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Goa Tourism

Goa Tourism

గత కొంతకాలంగా గోవాలో పర్యాటకుల (Goa Touristers) సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దీనిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే  మైఖేల్ లోబో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇక్కడున్న బీచ్‌లో ఇడ్లీ-సాంబర్‌ (Idli-Sambar), వడా పావ్‌లు విక్రయించడం వల్లే విదేశీ పర్యాకుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. నార్త్‌ గోవాలో జరిగిన ఓ మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' బెంగళూరు నుంచి గోవాకు వచ్చినవారు ఇక్కడి బీచ్‌ దుకాణాల్లో వడా పావ్‌లు విక్రయిస్తున్నారు. ఇంకొందరూ ఇడ్లీ సాంబర్ అమ్ముతున్నారు. ఇందువల్లే గత రెండేళ్ల నుంచి గోవాకు విదేశీ పర్యాటకలు సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. దీంతో ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారని'' మైఖేల్‌ లోబో అన్నారు.  

Also Read: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Goa MLA Blames "Idli-Sambhar"

అసలు పర్యాటక రంగంపై ఇడ్లీ సంబార్, వడా పావ్‌ (Vada-Pav) అమ్మకాలు ఎలా ప్రభావం చూపుతాయనే అంశాన్ని ఆయన వివరించలేదు. కానీ ఇందుకు అనేక కారణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు యుద్ధం కారణంగా కూడా ఉక్రెయిన్‌, రష్యా పర్యాటకులు గోవారు రావడం లేదన్నారు. గోవాలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోడవంపై ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని తెలిపారు. ఇందుకు అందరూ బాధ్యులేనంటూ తేల్చిచెప్పారు. 

Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకి గోవా ప్రజలు తమ దుకాణాలు రెంట్‌కు ఇవ్వడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంపై మరిన్ని కారణాలు తెలుసుకునేందుకు పర్యాటక శాఖతోపాటు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా సమావేశం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు స్థానిక ట్యాక్సీలు, క్యాబ్‌లు నడిపేవాళ్లకి కూడా అనేక సమస్యలున్నాయన్నారు. గోవాలో నెలకొన్న ఈ సమస్యలను పరిష్కరించకుంటే పర్యాటక రంగానికి చీకటి రోజులేనంటూ అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు