/rtv/media/media_files/2025/06/16/5VTGMbFbgkTlBzdIsl7E.jpg)
Raja Raghuvanshi and Sonam new trekking jungle video Honeymoon Murder Case
ఇండోర్ జంట రాజా రఘువంశీ, సోనమ్ విషయంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం వార్తల్లో నిలుస్తోంది. ఈ జంటకు సంబంధించిన కొత్త వీడియోలు తరచూ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజా, సోనమ్‌కు సంబంధించిన మరొక కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రాజా, సోనమ్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
Honeymoon Murder Case
ఈ వీడియోను మరో టూరిస్ట్ మహిళ తన ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి వార్తలు వైరల్‌గా మారడంతో ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ప్రోబబ్లీ ఇండోర్ కపుల్ లాస్ట్ వీడియో’ అంటూ క్యాప్షన్‌లో పేర్కొంది.
Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
ఈ కొన్ని సెకన్ల వీడియోలో హనీమూన్ జంట అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు మరొక మహిళ తన వ్లాగ్‌ను చేస్తుండగా.. అందులో వారిద్దరూ రికార్డ్ అయ్యారు. వీడియోలో సోనమ్ తన చేతిలో కర్ర పట్టుకుని ముందు నడుస్తుంది. వెనుక రాజా రఘవంశీ చేతిలో వాటర్ బాటిల్, బట్టలు పట్టుకుని నడుస్తున్నాడు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
కెమెరా చూసిన తర్వాత సోనమ్ కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. కెమెరా దగ్గరికి వచ్చేసరికి సోనమ్ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. సోనమ్ ముఖంలో చిన్న చిరునవ్వు కూడా లేదు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోనమ్ షిల్లాంగ్ పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఆమెతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య