/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
Heavy Rains: రుతుపవనాల ప్రభావంతో దేశంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇక రానున్న నెల రోజుల్లో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!
ఇదిలాఉండగా హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల భవనాలు కుప్పకూలాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. మండీ, శిమ్లా, సోలన్, సిర్మోర్, కులూ తదితర జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశాలో ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
Also Read: అంతరిక్షంలో భారత్ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం
బుద్ధబలంగ్, జాలక, సోనో, సుబర్ణరేఖ నదులు పొంగిపొర్లుతున్నాయి. సుభర్ణరేఖ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. బాలాసోర్, మయూర్‌భంజ్ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తేలిక నుంచి మోస్తరు వరకు వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఇదిలాఉండగా ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా ముందుగానే దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!