మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి?

దక్షిణ కొరియా అధ్యక్షడు యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించిన ఆరు గంటల్లోనే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు. ఎంపీలు నిరసనలు చేయడంతో పాటు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఎమర్జెన్సీని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
south korea

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. దేశంలో మార్షల్ లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాను ప్రకటించిన ఆరు గంటల్లోనే మళ్లీ ఉపసంహరించుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఎత్తివేయాలని పార్లమెంట్ నుంచి డిమాండ్ చేశారు. మార్షల్ లా ప్రకటించిన కొంత సమయానికే ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ ముందు నిరసన చేపట్టారని ఎత్తివేసినట్లు సమాచారం. ఈ నిరసనల్లో క్రమంగా పోలీసులకు ఎంపీల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియంత పార్క్ చుంగ్ హీ హత్య వల్ల 1979లో దేశంలో మార్షల్ లా అమలు చేశారు. ఆ తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

మార్షల్ లా ఎందుకు ప్రకటించారంటే?

నార్త్ కొరియా కమ్యూనిస్టు దళాల ద్వారా సౌత్‌ కొరియాకు పొంచిఉన్న ముంపు నుంచి రక్షించేందుకు, దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు.. నేను ఎమర్జెన్సీ మార్షల్ లా ను ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఇదిలాఉండగా.. 2022లో మే యూన్ సుక్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీ నియంత్రణలో ఉన్న జాతీయ అసెంబ్లీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజలను రక్షించేందుకు ఆయన ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!

ఇది కూడా చూడండి:  YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

Advertisment
తాజా కథనాలు