Watch Video: కాఫీ తయారు చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ తాజాగా ఓ ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లారు. వాళ్ల వ్యాపారం గురించి అడిగి విషయాలు తెలుసుకున్నారు. అలాగే ఆ షాప్‌లో రాహుల్ స్వయంగా ఓ కోల్డ్‌ కాఫీని తయారుచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సాధారణ ప్రజలతో మమేకమవుతుంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా చిరువ్యాపారులు, లారీ డ్రైవర్లు వంటి వారి వద్దకు వెళ్లారు. వాళ్ల పని గురించి అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రాహుల్‌గాంధీ మరోసారి అలాంటి ప్రయోగమే చేశారు. తాజాగా ఓ ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడి యాజమాన్యంతో కలిసి మాట్లాడారు.   

Also Read: ఈ నెల‌లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేస్తాం: ఉత్త‌రాఖండ్ సీఎం

వాళ్ల వ్యాపారం గురించి అడిగి విషయాలు తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన కస్టమర్లను కూడా పలకరించారు. అలాగే ఆ షాప్‌లో రాహుల్‌గాంధీ స్వయంగా ఓ కోల్డ్‌ కాఫీని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత రాహుల్‌గాంధీని ఓ వృద్ధురాలు తన ఇంటికి ఆహ్వానించింది. అదే భవనంలో ఆమె నివాసం ఉంటున్నారు.  

Also Read: గూగుల్ మ్యాప్స్‌ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు

రాహుల్ ఆమె ఇంటికి వెళ్లారు. అయితే సదరు మహిళ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాహుల్‌ని పిలిచారు గానీ ఇంటి తాళం చేవి లేదు. దీంతో ఆమె ఆందోళన పడ్డారు. ఆమెను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ వాళ్లతో ఫొటోలు దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు