/rtv/media/media_files/2025/12/25/pune-civic-polls-see-fancy-campaigns-2025-12-25-21-17-55.jpg)
Pune Civic Polls See Fancy Campaigns
మరో మూడు వారాల్లో పూణే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బరిలోగి దిగిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గిఫ్టులు, ఉచితాలు ఆఫర్లు చేస్తున్నారు. బైక్‌లు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు ట్రిప్పుల వంటి హామీలు ఉన్నాయి. వీటికోసం లక్కీ డ్రాలు నిర్వహించనున్నానే ప్రచారాలు నడుస్తున్నాయి.
పూణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు వార్డుల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓ వార్డులో అయితే స్థానిక సీనియర్ నేత కొందరు మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. వాళ్లకు ఏకంగా కొన్ని గజాల భూమినే ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనికోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని.. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించినట్లు సమాచారం.
Also Read: 'నా వీర్యం వాడుకోండి, ఖర్చులు భరిస్తా'.. టెలిగ్రాం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
మరో డివిజనకు చెంది అభ్యర్థుల పెళ్లయిన జంటల కోసం అయిదురోజుల థాయ్‌లాండ్ ట్రిప్‌కు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఇతర వార్డుల్లో సైతం లక్కీ డ్రా పేరుతో ఓటర్లకు బైక్‌లు, కార్లు, బంగారు నగలు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వార్డుకు చెందిన అభ్యర్థి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పట్టుచీరలు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఇంకో వార్డులో 500 మందికి కుట్టుమిషిన్లు, సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు పూణేలో క్రికెట్ ఫ్యాన్స్ కోసం లీగ్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసి యువ ఓటర్లకు గిఫ్ట్‌లు అందుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఓ అభ్యర్థి మెగా లక్కీ డ్రాను ఏర్పాటు చేసి లగ్జరీ SUVని గిఫ్ట్‌గా అందించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Follow Us