/rtv/media/media_files/2025/12/25/telegram-founder-pavel-durov-offers-to-fund-ivf-for-women-using-his-sperm-2025-12-25-19-21-37.jpg)
Telegram Founder Pavel Durov Offers To Fund IVF For Women Using His Sperm
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. దురోవ్ వీర్యం ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోకు చెందిన ఓ క్లినిక్‌లో ఉంది. అయితే ఆయన చాలాఏళ్ల క్రితమే తన వీర్యాన్ని దానం చేయడం ఆపేశారు. అంతకుముందు దానం చేసిన దాన్ని ఫ్రీజ్ చేసి ఇప్పటికి వాడుతున్నారు.
Also Read: ఉన్నావ్ రేపు కేసులో ఊహించని మలుపులు.. అసలేం జరిగిందో తెలుసా ?
అప్పుడప్పుడు దురోవ్ తన వీర్య దానం గురించి మాట్లాడుతుంటారు. ఇటీవల మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వీర్యకణాలు డొనేట్ చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నట్లు ఓ వైద్యుడు తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకే తన స్పెర్మ్‌ను దానం చేసి సంతానం లేని వారికి సాయం చేయడం సామాజిక భాద్యతగా భావించానని అన్నారు.
Also Read: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మృతి
15 ఏళ్ల పాటు తాను వీర్య దానం చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో తన వీర్య దానం వల్ల 100 మంది పిల్లలు పుట్టారని చెప్పారు. వాళ్లకు తన సంపందను కూడా పంచుతానని అన్నారు. గతంలో ఉన్న రిలేషన్‌షిప్స్ వల్ల తనకు ఆరుగురు పిల్లలు సంతానం అని తెలిపారు. ప్రస్తుతం దురోవ్ ఆదాయం 14 నుంచి 17 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్నంతా తన పిల్లలందరికీ సమానంగా పంచుతానని స్పష్టం చేశారు.
Follow Us