Manipur: మణిపుర్‌లో మళ్లీ హింస.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు మణిపుర్‌లో ఇటీవల మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కూకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శనివారం ఆ ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై నిరసనాకారులు దాడులు చేశారు. By B Aravind 16 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Protesters Attack Houses Of MLA's & MP's మణిపుర్‌లో మళ్లీ వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అల్లరి మూకలు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మైతీ వర్గానికి చెందిన కొంతమందిని కూకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆరుగురి మైతీల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. Also Read: నటి కస్తూరి అరెస్ట్ వీళ్ల హత్యకు నిరసనల మైతీ వర్గం ప్రజలు జిరిబామ్ జిల్లాలో శనివారం ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనాకారులు దాడులకు పాల్పడ్డారు. అలాగే వాళ్ల ఇళ్లపై కూడా దాడులు చేశారు. దీంతో జిరిబామ్ జిల్లా అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, బిష్ణుపూర్, కక్చింగ్, తౌబల్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. మొబైల్ డేటా సేవలను కూడా నిలిపివేశారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు అయితే లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ ఇంటిపై కూడా ఓ గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి చెప్పారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో ఇంటి ముందు కూడా నిరసనాకారులు నినాదాలు చేశారు. హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. Also Read: జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్.. ఇదిలాఉండగా.. ఇటీవలే అనుమానిత కుకీ మిలిటెంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై దాడులు చేశారు. దీంతో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత మైతీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా తీసుకెళ్లారు. శనివారం వాళ్ల మృతదేహాలు లభ్యమవ్వడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా #telugu-news #national-news #manipur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి