/rtv/media/media_files/2025/07/25/rajasthan-2025-07-25-09-38-40.jpg)
School building collapsed
రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లా లోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
राजस्थान -
— Sachin Gupta (@SachinGuptaUP) July 25, 2025
झालावाड़ में सरकारी स्कूल की बिल्डिंग गिरी। अब तक 5 बच्चों की मौत हुई, 30 से ज्यादा घायल हैं। 11 बच्चों की हालत गंभीर है। बचाव-राहत कार्य चल रहा है। pic.twitter.com/37ndPEQnZj
శిథిలాల కింద నలభై మంది పిల్లలు..
ఝలావర్ జిల్లాలోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇది జరిగిన సమయంలో అక్కడ 40 మంది పిల్లలతో పాటూ టీచర్లు కూడా మరికొంతమంది ఉన్నారు. ఉదయం 8.30 సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూలు కూలిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు అందరూ చనిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ ఎప్పటి నుంచో శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. దీనిలో 8 వరకు చదివే పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది జేసీబీతో శిథిలాలను తొలగిస్తోంది.