ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవలే జన్ సూరజ్ అనే కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఇందుకోసం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న క్రమంలో తాజాగా ఆ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు చోటచేసుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు ఈ సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. అసెంబ్లీ ఉపఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జరిగిన ఈ సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
ముస్లిం అభ్యర్థికే టిక్కెట్
ఇక వివరాల్లోకి వెళ్తే గయలోని బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి గతంలో పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ముస్లి అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించి జన్ సూరజ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో బెలగంజ్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్న ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీన్ని గమనించిన ప్రశాంత్ కిషోర్ వేదిక మీద నుంచి వాళ్లని వారించారు.
Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
బయటికి వెళ్లిపోయిన పీకే
కానీ ప్రశాంత్ కిషోర్ మాటాలను అక్కడున్న వాళ్లు ఎవరూ కూడా పట్టించుకోలేదు. వాళ్లలోనే ఒకరినొకరు దూషించుకుంటూ కుర్చీలు విసురుకుంటూ ఎవరికి దొరికిన దాన్ని వాళ్లు ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సమావేశం మధ్యలనే బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెలగంజ్ ఉప ఎన్నిత కోసం ముందుగా నలుగురి పేర్లు ప్రతిపాదించారు. వీళ్లలో అమ్జద్ హసన్, ప్రొ.ఖిలాపత్ హుస్సేన్, డానిష్ ముఖియా, ప్రొ. సర్ఫరాజ్ ఉన్నారు.
Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఈ నలుగురిలో అమ్జద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ పేర్లు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ బెలగంజ్ స్థానంలో తమ పార్టీ టిక్కెట్‌ను ఖిలాఫత్ హుస్సేన్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో అమ్జాద్ హసన్, ఖిలాపత్ హుస్సేన్ మద్దతుదారులు తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మద్దతుదారులు కుమ్ములాటకు దిగారు. చివరికి ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు.
Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!