లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హత్యకు ప్రతీకారంగా లెబనాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆ సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడం వల్ల తప్పించుకున్నారు.

New Update

లెబనాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుందని కథనాలు వినిపిసున్నాయి. ఇజ్రాయెల్‌ సిటీ సిజేరియాలో ఓ ఇంటిపై లెబనాన్ డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు ఇంటిపైనే లెబనాన్ దాడి చేసింది.

ఇది కూడా చూడండి: Andhra Pradesh: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నెతన్యాహు ఇల్లు పూర్తిగా..

ఈ దాడిలో నెతన్యాహు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. మూడు డ్రోన్లతో లెబనాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అందులో ఒకటి సెంట్రల్ ఇజ్రాయెల్ నగరమైన సిజేరియాలో నెతన్యాహు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ భవనం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కథనాలు తెలుపుతున్నాయి. 

ఇది కూడా చూడండి:  ED: అక్రమంగా దోచుకున్న డబ్బు.. మొదటిసారి రౌడీ షీటర్ ఆస్తులు జప్తు

మూడు డ్రోన్లలో కేవలం 2 మాత్రమే..

లెబనాన్ నుంచి మూడు డ్రోన్‌లు ఈజీగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని సమాచారం. అయితే మూడు డ్రోన్‌లు లెబనాన్ నుంచి హైఫా వైపు వెళ్తుండగా.. అందులో రెండు డ్రోన్‌లను మాత్రమే గుర్తించి ఆపగలిగారు. మూడో డ్రోన్ సిజేరియాలోని నెతన్యాహు భవనాన్ని ఢీకొట్టింది. అయితే అంత సులభంగా డ్రోన్‌లు దేశంలోకి ఎలా ప్రవేశించాయని ఇజ్రాయెల్ ఆర్మీ ఆలోచిస్తోంది. నెతన్యాహు ఇంటినే టార్గెట్ చేసి ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ భావిస్తోంది. 

ఇది కూడా చూడండి:  కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..

ఇదిలా ఉండగా.. దక్షిణ గాజా స్ట్రిప్‌లో చేపట్టిన దాడిలో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ పేర్కొంది. డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతుల్లో ఒకరు హమాస్‌ చీఫ్‌ అయిన యహ్యా సిన్వార్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ఇటీవల హమాస్ కూడా ధృవీకరించింది. ముఖ్య, కీలక నేతలందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే హమాస్ సంస్థ మాత్రం ఏం జరిగినా తగ్గేదే లేదు అంటోంది. ఎవరు చనిపోయినా ఇజ్రాయెల్ పౌరులను వదిలిపెట్టమని హమాస్ డిప్యూటీ చీఫ్ ఖలీల్ అల్-హయ్యా తెగేసి చెబుతున్నారు.  

ఇది కూడా చూడండి:  ఢిల్లీ మద్యం కుంభకోణం .. వర్చువల్‌గా హాజరుకానున్న కవిత

Advertisment
Advertisment
తాజా కథనాలు