/rtv/media/media_files/2025/11/14/prashanth-2025-11-14-07-35-18.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నిక(Bihar Assembly Elections 2025)ల్లో ఒక్క సీటు కూడా సాధించకపోవడంపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(prashanth kishore starategy) తొలిసారి స్పందించారు. నిజాయతీగా ప్రయత్నించినప్పటికీ ఫైయిల్ అయ్యానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తప్పిదాలను సరిదిద్దుకొని తిరిగి మరింత బలంగా వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని పీకే అన్నారు. పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి 100శాతం బాధ్యత తనదేనన్నారు. ఈ సందర్భంగా అధికార కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించిన పీకే.. కుల, మతాల పరంగా ప్రజలను విభజించి, డబ్బుతో ఓట్లు కొన్న నీతీశ్, బీజేపీ నేత సామ్రాట్ ఛౌదరీల మాదిరిగా తాను బిహార్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యానని ఎద్దేవా చేశారు.
Also Read : ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్‌లోనే..!
Prashant Kishor Strategy
బిహార్‌లో రెండు కూటములకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లోకి వెళ్లిన ప్రశాంత్ కిశోర్(prashanth-kishore) జన్‌సురాజ్ పార్టీ 238 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించింది. కానీ, ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ పార్టీకి 3.44శాతం ఓట్ల వచ్చాయి. 68 అసెంబ్లీ స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. అంతేకాదు జన్‌సురాజ్‌కు చెందిన 236 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. ఓటమిని అంగీకరించడంలో ఎటువంటి భేషజాలు లేవని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. వ్యవస్థాగత మార్పును పక్కనపెడితే.. ప్రభుత్వంలోనైనా మార్పు తీసుకురాలేక పోయామని, అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలు మార్చడంలో కచ్చితంగా కొంత పాత్ర పోషించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో 60వేల మంది లబ్ధిదారులకు నీతీశ్ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఇవ్వకుంటే ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితమయ్యేదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఓట్లు పొందకపోవడం నేరం కాదని, అయితే.. అవినీతి, విభజన రాజకీయాలు మాత్రం తాను చేయలేదని అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.
Also Read : చావనైనా చస్తాను గానీ తలవంచను.. హిడ్మా హిస్టరీ తెలిస్తే షాక్..!
Follow Us