Prakash Raj: పవన్ ఇదేం సినిమా కాదు.. టైమ్ వేస్ట్ చేయొద్దు: ప్రకాశ్ రాజ్ మరో సంచలనం!

సినిమాల్లో వేషాలు మార్చినట్లు రాజకీయాల్లో రంగులు మార్చకూడదంటూ పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్స్ వేశారు. పొలిటికల్ ఎంట్రీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడి అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయారన్నారు. ఇతర అంశాలపై టైమ్ వేస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. 

New Update
pawan prakash

Prakash Raj sensational comments on Pawan Kalyan

Prakash Raj: సినిమాల్లో వేషాలు మార్చినట్లు రాజకీయాల్లో రంగులు మార్చకూడదంటూ పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్స్ వేశారు. పొలిటికల్ ఎంట్రీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడి అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయారన్నారు. ఇతర అంశాలపై టైమ్ వేస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. 

సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?

ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. జాతీయ అవార్డులు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి పవన్‌.. అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై పెద్దగా దృష్టిపెట్టడం లేదన్నారు. రకరకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదని, అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ వివాదం, సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు. కానీ చాలా సున్నితమైన అంశాలను జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. భక్తుల మనోభావాల గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. 

Also Read :  ఆ అందగత్తెతో  డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్‌

ఇదిలా ఉంటే.. గతంలోనూ తిరుపతి లడ్డూ వివాదంలో ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!.. కదా?.. ఇక చాలు.. ప్రజలకోసం చెయ్యవలసిన పనులు చూడండి.. ఎనఫ్‌ ఇజ్ ఎనఫ్‌ జస్ట్ ఆస్కింగ్’’ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్‌ రాజ్ సెటైర్లు వేశారు.

Also Read :  ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!

Pawan Kalyan | andrapradesh | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు