/rtv/media/media_files/2025/08/02/revanna-2025-08-02-15-09-38.jpg)
JDS మాజీ ఎంపీ ప్రజ్వేల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో అతనికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. తాజాగా అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై అతను హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తన ఏకైక తప్పు అని జడ్జి ముందు మాజీ ఎంపీ అన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. తాను చాలా మంది మహిళలపై అత్యాచారం చేశానని వాళ్ళు అంటున్నారు, కానీ ఏ ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రాలేదన్నారు , 2024 లోక్ సభ ఎన్నికలకు ఆరు రోజుల ముందు వచ్చారని, ప్రాసిక్యూషన్ వైపు వారిని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేశారని ప్రజ్వల్ కోర్టులో వాపోయారు. తాను బిఈ మెకానికల్ గ్రాడ్యుయేట్ అని, ఎల్లప్పుడూ మెరిట్‌లో ఉత్తీర్ణుడయ్యానని కూడా అతను కోర్టుకు తెలిపాడు. ఆరు నెలలుగా తన తండ్రి, తల్లితో సహా తన కుటుంబాన్ని కలవలేదని ఆయన వాపోయారు.
Karnataka | Expelled JDS Leader and former Lok Sabha MP Prajwal Revanna sentenced to life imprisonment by the Special Court for People's Representatives in connection with a rape case of a domestic worker at a farmhouse in Holenarasipura in Hassan district
— ANI (@ANI) August 2, 2025
(file pic) pic.twitter.com/YGEVpwzICR
Also Read : తల్లిని కాటేసిన పాము.. వీపుపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన కూతురు.. కన్నీళ్లు పెట్టించే వీడియో
కర్ణాటకలోని హసన్ జిల్లాలోని గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులకు కంప్లైట్ ఇచ్చింది. ఆ దారుణాన్ని వీడియోలు కూడా తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. గతేడాది మే 31న ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. 123 ఆధారాలు, 2 వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. 23 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు.. 14 నెలల తర్వాత రేవణ్ణను దోషిగా తేల్చింది. ఈ తీర్పుతో ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు. తనకు తక్కువ శిక్ష వేయాలని ఏడుస్తూ జడ్జిని వేడుకున్నారు. రాజకీయంగా త్వరగా ఎదగడమే తాను చేసిన తప్పంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
3 వేల అశ్లీల వీడియోలు
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సుమారు 3 వేల అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా ప్రజ్వలే పలు వీడియోలను తీసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఒక పెన్‌డ్రైవ్‌ను కూడా ఫామ్‌హౌస్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రతక్ష్యమయ్యాయి. దీంతో హాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ ఎన్నికల్లో ఓడిపోయారు. వీడియోలు కూడా వైరల్ కావడంతో జేడీఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఇక అత్యాచారం కేసులో IPC సెక్షన్లు 376(2)(k), 376(2)(n) ప్రకారం ప్రజ్వల్‌కు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది.
Also Read : లైవ్ వీడియో.. రన్నింగ్ బస్సు నుంచి జారి పడిపోయిన చిన్నారి
prajwal-revanna | latest-telugu-news | telugu-news | national news in Telugu | rape-case