/rtv/media/media_files/2025/08/02/revanna-2025-08-02-15-09-38.jpg)
తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. మరికాసేపట్లో కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. ఈక్రమంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ జడ్జినిప్రజ్వల్ రేవణ్ణ వేడుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తన ఏకైక తప్పు అని మాజీ ఎంపీ అన్నారు.
అంతేకాకుండా ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. నేను చాలా మంది మహిళలపై అత్యాచారం చేశానని వాళ్ళు అంటున్నారు, కానీ ఏ ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రాలేదు, 2024 లోక్ సభ ఎన్నికలకు ఆరు రోజుల ముందు వచ్చారు... ప్రాసిక్యూషన్ వైపు వారిని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేశారు" అని ప్రజ్వల్ ఏడుస్తూ అన్నారు. తాను బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ అని, ఎల్లప్పుడూ మెరిట్‌లో ఉత్తీర్ణుడయ్యానని కూడా అతను కోర్టుకు చెప్పాడు. ఆరు నెలలుగా తన తండ్రి, తల్లితో సహా తన కుటుంబాన్ని కలవలేదని ఆయన అన్నారు.
Also Read : తేజశ్వీ యాదవ్‌కు బిగ్ షాక్.. ఓటర్ లిస్టులో పేరు మిస్సింగ్
ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపుల అభియోగాలపై ఉన్న నాలుగు కేసులు ఉండగా , ఆగస్టు 1న ఆయన దోషిగా తేల్చింది. ఈ కేసులో నిన్న కోర్టు అతన్ని దోషిగా ప్రకటించిన వెంటనే ప్రజ్వల్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరమూ వెక్కివెక్కి ఏడ్చాడు. రేవణ్ణ కుటుంబం వద్ద పని చేసిన 47 ఏళ్ల మహిళపై 2021లో రెండుసార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదులో ఆరోపించింది. ఒకసారి హసన్‌లోని ఫామ్‌హౌస్‌లో, మరోసారి బెంగుళూరులోని తన ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా ఈ చర్యను ఆయన తన మొబైల్‌లో రికార్డ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.
#BreakingNews: Ex-MP #PrajwalRevanna sentenced in rape case; the JD(S) leader breaks down in Court, pleads for 'minimum sentence'.#PrajwalRevannaGuilty#PrajwalRevannaCasehttps://t.co/piHWN6Kn2ipic.twitter.com/G6sxvvtPCr
— Hate Detector 🔍 (@HateDetectors) August 2, 2025
ప్రజ్వల్ రేవణ్ణ పొలిటికల్ కెరీర్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మనవడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కుమారుడిగా ప్రజ్వల్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయననుజనతాదళ్ (సెక్యులర్) (JD(S)) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో భారత్ లో అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటు సభ్యులలో ఆయన ఒకరు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు ఆయన రాజకీయ జీవితం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Also Read : 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?
telugu-news | karnataka | prajwal-revanna | latest-telugu-news | national news in Telugu