BIG BREAKING: తెలంగాణలో పవర్ షేరింగ్.. మీడియా చిట్ చాట్ లో భట్టి సంచలన వ్యాఖ్యలు!

తమ ప్రభుత్వంలో అంతా కలిసి పనిచేస్తున్నారని, ఇక్కడ పవర్‌ షేరింగ్‌ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరం కలిసి టీమ్‌ వర్క్‌గా పనిచేస్తున్నామన్నారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన పలు విషయాలు వెల్లడించారు.

New Update
Batti Vikramarka

Batti Vikramarka

 BIG BREAKING: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అదే సమయంలో జనాల్లోకి వెళ్లడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.వారి నిర్ణయం ఏంటో తెలియదన్నారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన బీఆర్‌ఎస్‌ నేతల మాటలు మితిమీరిపోయాయని విమర్శించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వంలో అంతా కలిసి పనిచేస్తున్నారని, ఇక్కడ పవర్‌ షేరింగ్‌ అంటూ ఏమీ లేదని మల్లు తెలిపారు. అందరం కలిసి టీమ్‌ వర్క్‌గా పనిచేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం బాగానే ఉందని స్పష్టం చేశారు.

Also Read:kuberaa Box Office collections: అమెరికాలో కుబేరా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే ఎంత వసూలు చేసిందంటే!

రాష్ర్టంలో100 శాతం రుణమాఫీ చేశామని భట్టి తెలిపారు. రైతు భరోసా ఇచ్చాం. ఆరోగ్య శ్రీ 10 లక్షలుకు పెంచాం.పేదలకు ఇళ్లు ఇస్తున్నాము..200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాము...రూ.500 వందలకు సిలిండర్ ఇస్తున్నాము. సన్న బియ్యం సక్సెస్ అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు సక్సెస్ అయ్యింది అని భట్టి తెలిపారు. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయన్నారు. మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది.తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు..సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించాము.ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే,కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి వివరించారు.

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు