kuberaa Box Office collections: అమెరికాలో కుబేరా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే ఎంత వసూలు చేసిందంటే!

ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన "కుబేర" చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. విడుదలైన తొలి రోజే రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అలాగే నార్త్ అమెరికాలోనూ భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది.

New Update

kuberaa Box Office collections:  శేఖర్ కమ్ముల  'కుబేరా' చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటు ఓవర్ సీస్ లోనూ  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  విడుదలైన తొలి రోజే   రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. సాక్నిల్క్  నివేదిక ప్రకారం..   శుక్రవారం  విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ₹14.75 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు శనివారం  ₹16 కోట్లకు పెరిగింది.  తెలుగు వెర్షన్ నుంచే ₹12.77 కోట్లు రాగా, తమిళ వెర్షన్ ₹4.5 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ కూడా ₹34 లక్షలు సాధించింది.  'కుబేరా' అన్ని భాషల్లోనూ  మంచి వసూళ్లను సాధించడం  విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది. 

Also Read:  Subhashree: బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ సంగీత్ లో సింగర్ భోలే రచ్చ రచ్చ! వీడియో వైరల్

ఉత్తర అమెరికాలోనూ హవా.. 

ఉత్తర అమెరికాలోనూ  ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్  నమోదు చేసింది. ప్రీమియర్ లు, మొదటి రోజు కలెక్షన్లు కలిపి ఏకంగా  $1.2 మిలియన్  సుమారు రూ. 10 కోట్లు మార్క్ ను దాటింది. కేవలం ప్రీమియర్‌ల  సుమారు రూ. 4.2 కోట్లు రాబట్టడం విశేషం.

ధనుష్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ 

ఉత్తర అమెరికాలో విడుదలైన  ధనుష్ సినిమాల్లో  అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమాగా  'కుబేరా' నిలిచింది. దీంతో గత ఆయన గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.   మరోవైపు, అక్కినేని నాగార్జున  కెరీర్‌లో ఉత్తర అమెరికాలో మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.  ఇక వీకెండ్ కావడం వల్ల ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వారాంతం ముగిసేనాటికి ₹50 కోట్ల మార్కును చేరుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: Viral News: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!

Advertisment
Advertisment
తాజా కథనాలు