Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు

ఈమధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అలహాబాద్ హైకోర్టు. తాజాగా అత్యాచార కేసులో బాధితురాలిదే తప్పు అంటూ తీర్పు ఇచ్చింది. కావాలనే ఆ సమస్యను కొనితెచ్చుకుందని చెబుతూ నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..

New Update
alahabad high court

alahabad high court

నెల రోజుల క్రితమే.. స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఇదే కోర్టు మళ్ళీ అలాంటి వివాదానికే తెర లేపింది.  ఒక రేప్ కేసులో తప్పంతా బాధితురాలిదే అంటూ కామెంట్స్ చేసింది. దాంతో పాటూ నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. అసలా కేసేంటి అంటే..

2024లో ఢిల్లీలో ఓ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఆమె ఫ్రెండస్ తో కలిసి హౌజ్ ఖాస్ బార్ కు వెళ్ళింది. అక్కడ బాగా తాగి ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్కడే ఆ అమ్మాయికి ఓ వ్యక్తి పరిచయం కూడా అయ్యాడు. తెల్లవారుఝాము 3 గంటల వరకు వారంతా ఆ బార్ లోనే ఉన్నారు. చివర్లో ఆ అమ్మాయికి వంతి వస్తున్నట్టు అనిపించింది. అప్పటికే ఆమెకు బాగా మత్తెక్కింది. దాంతో తనకు సహాయం చేయమని సదరు వ్యక్తిని కోరింది. దాంతో అతను ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడకు వెళ్ళాకు తనను అసభ్యంగా తాకాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అంతా ఆ అమ్మాయి వల్లనే..

ఈ కేసులో నిందితుడు తనకు బెయిల్ కావాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అంతకు ముందు నిందితుడు ఆ అమ్మాయి పరిచయం అయిందని..ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్ళామని అక్కడ ఇద్దరం కలిసి ఇష్ట పూర్వకంగానే కమిసామని చెప్పాడు. తాను అత్యాచారం చేయలేదని చెప్పాడు. ఇరువురు వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ధర్మాసనం బాధితురాలినే తప్పుబట్టింది. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయినా...సంఘటన జరగడానికి బాధ్యరాలు ఆమె అంటూ కామెంట్ చేసింది. అంతలా తాగడం వల్లనే సమస్య వచ్చిందని..తనతంట తానే సమస్యను ఆహ్వానించిందని.. బాధితురాలి హైమెన్ పొరకు డ్యామేజీ జరిగినా అది లైంగిక దాడి వల్లే జరిగిందని వైద్యులు ధ్రువీకరించ లేకపోయారన్నారు. బాధితురాలు చిన్న పిల్ల కాదని..పీజీ చదువుతున్న అమ్మాయని..ఆమె చర్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంటుందని తీర్పు చెప్పారు. నిందితుడిపై ఇంతకు ముందు ఎలాంటి కేసులు లేవు కాబట్టి అతను చెప్పింది అబద్ధమని చెప్పలేమని ధర్మాసనం అంది. అందుకే అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 

 today-latest-news-in-telugu | alahabad | high-court | sensational-comments 

Also Read: Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు