Delhi Polling: ముగిసిన ఢిల్లీ పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.బుధవారం ఉదయం 7 గంటలు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

New Update
Delhi Polling

Delhi Polling

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. నార్త్ ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో ఎక్కువగా 52. 73 శాతం పోలింగ్ నమోదైంది. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఈ రెండు చోట్ల 42.41 శాతం, 44.59 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈరోడ్‌ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్‌ ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. అయోధ్య జిల్లా మిల్కిపుర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలను బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.  

Also Read: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!

ఇదిలాఉండగా.. ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also Read: సైబర్ నేరాల కట్టడికి థాయ్‌లాండ్ సంచలన నిర్ణయం.. ఆ దేశంలో కరెంట్ కట్

Also Read: పంజాబ్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసిన బీజేపీ

Advertisment
తాజా కథనాలు