Draupadi Murmu: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

New Update
pm murmu

PM Modi Comments On Draupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆ పదవి అప్పగించడం ఎన్డీయే అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మొదట్లో ఈ పదవికి ఆమె పేరును ప్రతిపాదించగా.. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ పిలుపునిచ్చారని తెలిపారు. బీహార్‌లో జాతీయ గిరిజన దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎం జన్‌మన్ యోజన పథకం ద్వారా పనులను ప్రారంభించిన ఘనత ద్రౌపదీ ముర్ముదే అని కొనియాడారు. 

Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు

రాష్ట్రంలో ఆదివాసీల కష్టాలు తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదని అన్నారు. వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నడూ కృషి చేయలేదని ప్రధాని విమర్శలు చేశారు. సమాజానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలకు తమ ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. 

Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

వాళ్లు పండించే 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు. అలాగే ఆదివాసీ యువత క్రీడలతో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. వాళ్లని మరింత ప్రోత్సహించేందుకు అనేక క్రీడా సౌకర్యాలు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఆదీవాసీలకు చదవు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. వాళ్ల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని.. బడ్జెట్‌ను రూ.25 వేల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. 

Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

Also Read :  పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు