PM Modi: ఏఐ అంత ప్రమాదకరం! ప్రపంచ దేశాలకు మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నాలుగో రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో పాటు సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

New Update
Modi

Modi

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నాలుగో రోజున ప్రధాని నరేంద్ర మోదీ(narendra-modi) ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో పాటు సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వంటి ప్రపంచ నాయకుల సమక్షంలో ఈ సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

Also Read :  మధ్యప్రదేశ్‌లో ఘోరం: భార్య ప్రైవేట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన భర్త!

సరైన దిశలో వాడితే అద్భుతమైన ఫలితాలు

మనం అణుశక్తి వల్ల కలిగే వినాశనాన్ని చూశాం, అలాగే దాని వల్ల కలిగే ప్రయోజనాలనూ చూశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా సరిగ్గా అలాంటిదే. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి అస్త్రం. దీనిని సరైన దిశలో వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, లేదంటే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఏఐని కేవలం మెషీన్ల కోణంలో కాకుండా, మానవత్వంతో కూడిన సాంకేతికతగా మార్చడమే మన లక్ష్యం అని ప్రధాని అన్నారు.

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎప్పుడూ మనిషి చేతుల్లోనే ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. ఏఐ ఇచ్చే డేటాను మనం ఉపయోగించుకోవాలి తప్ప, ఏఐ మనల్ని శాసించే స్థాయికి వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా భారత్‌లోని యువత ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, యువతే మన దేశానికి అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు.

ఈ సదస్సులో పాల్గొనడానికి దాదాపు 20కి పైగా దేశాధినేతలు, 60 మందికి పైగా విదేశీ మంత్రులు,  500 మంది గ్లోబల్ టెక్ ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ ఐదు రోజులుగా ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Also Read :  పాకిస్థాన్‌కు ఎండాకాలంలో 'జల'గండం.. రావి నదిపై గుప్పిట బిగించిన భారత్

Advertisment
తాజా కథనాలు